Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంది ఆవేశమా.. ఆవేదనా..?

Kiran Abbavaram :  కిరణ్ అబ్బవరంది ఆవేశమా.. ఆవేదనా..?
X

రాజా వారు రాణిగారు అనే మూవీతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరంకు ఫస్ట్ మూవీతో హిట్ పడింది. తర్వాత తనదైన శైలిలో ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ గురువారం అతను నటించిన 'క' సినిమా విడుదలవుతోంది. మూవీ రిజల్ట్ గురించి పక్కన పెడితే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ చేసిన ప్రసంగం టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది. తనను ఇండస్ట్రీలో చాలామంది ఇబ్బందులు పెడుతున్నారని వేదిక మీదే చెప్పడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. మామూలుగా ఇండస్ట్రీలో 'అవుటర్స్' ఇంత ధైర్యంగా ఓపెన్ డయాస్ పై ఇలాంటివి మాట్లాడరు. బట్ కిరణ్ తన ఆవేదన వెళ్లగక్కాడు. చాలామంది ఆవేశ పడుతున్నాడు అన్నారు. కానీ.. ఏదో సినిమాలో అతనిపై సెటైర్స్ వేసి, కనీసం తనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పడం చూస్తే అతను ఆవేశపడ్డా తప్పులేదు అనిపిస్తుంది. చెక్ పోస్ట్ దగ్గర ఒక ఆఫీస్ లో కూర్చుని తనపై చాలా ట్రోల్స్,మీమ్స్ చేస్తూ తనను డీ గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నాడు.

'అన్నా నేను మీకేం చేశాను. నా పనేదో నేను చేసుకుంటున్నాను. మిమ్మల్ని నేనేమన్నాను. ఎందుకు నన్నిలా చేస్తున్నారు. ఇండస్ట్రీలో మా లాంటి వాడు ఎదగకూడదా..? నా సక్సెస్ గురించి మాట్లాడుతున్నవాళ్లకు ఒకటే చెబుతున్నా.. 8 సినిమాల్లో 4 హిట్స్ ఉన్నాయి నాకు. అసలు నాలాంటోడు సినిమా తీసి రిలీజ్ చేస్తేనే సక్సెస్ అయినట్టు.. నాకు సక్సెస్ లేదు అని మీరెలా అంటారు. నేనేదే చిన్న ఊరిలో కూలి పని చేసుకునే స్టేజ్ నుంచి వచ్చాను. అలాంటి నన్ను డబ్బున్నోడు అని.. ఇంకేదేదో అంటున్నారు. కనీసం తెలుసుకోవాలి కదా.." అంటూ చాలా ఆవేశంగా మాట్లాడాడు కిరణ్.

కిరణ్ విషయం అలా ఉంచితే.. అదే చెక్ పోస్ట్ ప్రాంతం నుంచి ఇండస్ట్రీలో ఎవరైనా హిట్స్ కొడితే అదీ బయటి వాళ్లైతే.. ఓ రేంజ్ లో ట్రోల్స్ చేయడం.. వారిని బ్లేమ్ చేస్తూ మీమ్స్, ట్రోల్స్ చేయడం పరిపాటైపోయింది అనేది ఓపెన్ సీక్రెట్. ఇందుకు విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు కూడా బలైపోయారు. కాకపోతే అతనికి సపోర్ట్ ఉంది. అదే కాపాడింది. లేదంటే విజయ్ మీద వచ్చిన నెగెటివిటీ మరో హీరోకు వస్తే అంతే సంగతులు. ఇండస్ట్రీ వదిలి పారిపోతారు. మరి వాళ్లెవరు అనేది పరిశ్రమలో చాలామందికి తెలుసు. కానీ చెప్పరు. సో.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ఆవేశం, ఆవేదన చూశారు కదా. ఒకవేళ క సినిమా అటూ ఇటైతే మళ్లీ వారి పైశాచికత్వం సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో విషం చిమ్మడం అనేది ఊహించేదే. ఏదేమైనా కిరణ్ కూడా కాస్త సంయమనం పాటించి ఉంటే బావుండేదీ అనేవాళ్లూ లేకపోలేదు.

Tags

Next Story