Kishkindhapuri Trailer : ట్రైలర్ తోనే వణికించిన కిష్కింధపురి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. ఈ నెల 12న విడుదల కాబోతోన్న కిష్కింధపురి ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ చూడగానే ఆకట్టుునేలా ఉంది. చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. ఇంతకు ముందే వచ్చిన టీజర్ తో ఇదో హారర్ మూవీ అని అర్థం అయింది. హారర్ బ్యాక్ డ్రాప్ లోనే కనిపిస్తోన్న అంతకు మించిన కంటెంట్ ఇంకేదో మూవీలో ఉన్నట్టుగా ట్రైలర్ తో అర్థం అవుతోంది. మామూలుగా ఘోస్ట్ హంటర్స్ నేపథ్యంలో అనేక సినిమాలున్నాయి. ఇది కూడా అలానే మొదలై అనేక మలుపులతో కూర్చున్నంత సేపూ ఆడియన్స్ ను భయపెట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.
‘ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం..’అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది ట్రైలర్. దెయ్యాలమీద క్యూరియాసిటీ ఉన్న వాళ్లందరినీ ఒక దెయ్యాల కొంపకు తీసుకెళ్లి దానివెనకున్న కథేంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ టూర్ ఇస్తారు అనే భద్రం డైలాగ్ తో ఆ కిష్కింధపురిలోని ఘోస్ట్ వాకింగ్ టూర్ టీమ్ ను పరిచయం చేశారు. ఈ టీమ్ లో శ్రీనివాస్, అనుపమ, ఆది, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్ లతో పాటు మరికొందరు ఉంటారు. ఆ ఇంట్లోకి వెళ్లగానే నిజంగానే దెయ్యాలు వారితో ఆటాడేసుకుంటాయి. ఇవి కామన్ గానే అనిపించినా.. ఆ తర్వాత ట్రైలర్ లోనే అనేక మలుపులు కనిపిస్తున్నాయి. హారర్ కు మించిన కంటెంట్ ఇంకేదో ఉన్నట్టుగా తెలుస్తుంది. ‘బ్రతుకుమీద ఇంత తీపి ఉన్నవాళ్లు బ్రతకడానికి అర్హులే కారు’అనే దెయ్యం డైలాగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొత్తంగా ఆ టీమ్ మొత్తం ప్రమాదంలో పడుతుంది. వారిని కాపాడే బాధ్యత శ్రీనివాస్ తీసుకుంటాడు. ఈ క్రమంలో అత్యంత శక్తివంతమైన ఆ దెయ్యాన్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు అనే కోణంలో సాగిన ట్రైలర్ ఆద్యంత చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక అనుపమ పై ఉన్న లాస్ట్ షాట్ సూపర్బ్ అని చెప్పాలి.
ట్రైలర్ చూస్తుంటనే చైతన్ భరద్వాజ్ సంగీతం హైలెట్ కాబోతోంది అనిపించేలా ఉంది. రెగ్యులర్ హీరో హీరోయిన్ టైప్ ఎంటర్టైనర్ లా కాకుండా సినిమా ఆరంభం నుంచే భయపెట్టబోతున్నారనేది అర్థం అవుతోంది. మరి ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ హిట్ కొడతారా అనేది చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com