Siddhu Jonnalagadda : సిద్ధుకు ముద్దుపెట్టుకునే స్థలం కావాలట

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న సినిమా ‘జాక్’. వైష్ణవి చైతన్య హీరోయిన్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా ఓ సాంగ్ విడుదల చేశారు. ‘భాగ్య నగరం అంతా మనదే మనదే.. నీ బాధే తీరుస్తా పదవే పదవే.. జంటై పోదాం అందే పెదవే పెదవే.. దునియాతో పనిలేదింకా పదవే పదవే ..’ అంటూ మొదలైన ఈ పాటకు ముందు వచ్చిన సీన్ చూస్తే.. హీరోయిన్ హీరోను ముద్దు అడగటం అందుకోసం అతనికి ఎక్కడా సరైన స్థలమే దొరకలేదు అని చెబుతూ నగరం అంతా సరైన ప్లేస్ కోసం తిరుగుతూ ఉండగా వచ్చే పాటలా ఉంది. మాంటేజ్ సాంగ్ అయినా మంచి డ్యాన్స్ లు ఉన్నాయి. సిద్ధులో ఈ యాంగిల్ ను కూడా బాగా ఎలివేట్ చేసిందీ పాట. ఇలాంటి మాంటేజ్ సాంగ్స్ లో మంచి సీక్వెన్స్ లతో పాటు డ్యాన్స్ లు కూడా బాగా కంపోజ్ చేస్తాడు రాజు సుందరం. అతనితోనే కొరియోగ్రఫీ చేయించారు.
సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ గీతాన్ని సనరే రాశారు. జావేద్ అలీ, అమలా చేబోలు కలిసి పాడారు. సింపుల్ గా సాగుతూ ఆకట్టుకునేలా ఉంది. కాస్ట్యూమ్స్ బావున్నాయి. వైష్ణవి చైతన్య పూర్తిగా చీరలోనే ఉండటం బలే అనిపిస్తుంది.
ఇక ఈ సమ్మర్ లోనే ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. డిజే టిల్లు, టిల్లు స్క్వేర్ తర్వాత వస్తోన్న మూవీ కాబట్టి హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ ఉందనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈ మూవీపై పూర్తిగా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com