Kareena Kapoor: కరణ్ జోహార్ ప్రశ్నకు కరీనా షాక్.. మాజీ భర్త షాహిద్ అనడంతో..

Kareena Kapoor: కరీనా కపూర్ కాఫీ విత్ కరణ్‌లో మరోసారి దర్శనమిచ్చింది. అమీర్ ఖాన్‌తో నటించిన లాల్ సింగ్ చద్దా ప్రమోషన్‌లో భాగంగా అమీర్, కరీనా ఈ షోలో పాల్గొన్నారు. ఇప్పటికే చాలా సార్లు కరీనా షోలో కనిపించింది – వర్ధమాన నటిగా, వివాహిత మహిళగా, స్టార్ హీరోయిన్‌గా, గర్భిణీగా ఇలా విభిన్న పాత్రలు పోషించినప్పుడు వాటికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంది.
అయితే తాజాగా ఈషోలో పాల్గొన్న కరీన.. షో వ్యాఖ్యాత కరణ్ జోహార్ ప్రశ్నకు షాకయ్యింది. రాపిడ్ ఫైర్ రౌండ్‌లో హోస్ట్ కరణ్ జోహార్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆమె అభిమానులను వారి స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేసింది. కరీనా ఈ రోజు దేశంలోని అగ్ర నటుడు మరియు నటి ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు.
కజిన్ రణభీర్ కపూర్, మాజీ ప్రియుడు షాహిద్ కపూర్ పార్టీ చేసుకుంటే ఎవరు మిమ్మల్ని ఆహ్వానించరు అని కరీనాను అడిగాడు కరణ్.. దానికి కరీనా.. రణభీర్ కజిన్ కాబట్టి ఆహ్వానిస్తాడు.. షాహిద్ కపూర్ మాత్రం ఆహ్వానించకపోవచ్చు అని వివరించింది. ఇంకా కరణ్ షాహిద్‌ని మాజీ భర్త అని సంబోధించాడు. దాంతో కరీనా ఒక్కసారిగా షాకయ్యింది. వెంటనే తేరుకున్న కరణ్.. కరీనాకు సారీ చెప్పాడు.
షాహిద్ కపూర్‌తో కలిసి కరీనా జబ్ వి మెట్ అనే చిత్రంలో నటించింది. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కానీ ఆ సినిమా తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు.. అయితే అదే సమయంలో వచ్చిన తషాన్ కరీనా జీవితాన్ని మార్చేసింది. అందులో హీరో సైఫ్ అలీఖాన్.. ఇద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు.. అనంతరం పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లిద్దరికి ఇద్దరు కుమారులు.
అమీర్ ఖాన్ మరియు కరీనా కపూర్ గతంలో కలిసి 3 ఇడియట్స్ మరియు తలాష్ చిత్రాల్లో నటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com