చిత్రసీమలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత

Anandha Kannan: తమిళ చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, యాంకర్ ఆనంద కణ్ణన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆనంద కణ్ణన్ సోమవారం ఆగష్టు 16న కన్నుమూసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షిణించడంతో చెన్నైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. 48 ఏళ్ల వయసులో క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ.. ఆయన నవ్వుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. అనంద మరణవార్త తెలియగానే కోలీవుడ్ దిగ్భ్రాంతికి గురైంది.
సింగపూర్-తమిళియన్ అయిన ఆనంద..కాగా, సింగపూర్‌లో వసంతం టీవీ ద్వారా వీజేగా కెరీర్ ప్రారంభించిన ఆనంద.. తర్వాత చెన్నైలో స్థిరపడ్డాడు. సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీలో సీరియళ్ల ద్వారా ఆడియెన్స్‌ను అలరించాడు. క్రియేటర్‌గా, నటుడిగా 30 ఏళ్ల పాటు తమిళ ఆడియొన్స్‌ను ఆయన అలరించాడు. సింగపూర్‌లోనూ ఆయన షోలు సూపర్ హిట్. యూత్ ఐకాన్‌గా పేరున్న ఆనంద మృతిని చాలామంది తట్టుకోలేకపోతున్నారు. 90వ దశకంలో కోలీవుడ్ లో తన కంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు.
ముఖ్యంగా సన్ టీవీ సిరీస్ సింధ్‌బాద్‌లో లీడ్ రోల్ ద్వారా పిల్లలకు, యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. #RIPanandakannan ట్రెండ్‌తో సోషల్ మీడియా నివాళి అర్పిస్తోంది. సింగపూర్ సెలబ్రిటీ వడివళన్, కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 'సరోజ, అదిసయ ఉల్గం' చిత్రాల్లో ఆయన నటించగా.. మరో రెండు చిత్రాలు రిలీజ్‌కు నోచుకోలేదు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com