Suriya vs Ajith Kumar : కోలీవుడ్ టాప్ హీరోల బిగ్ ఫైట్

ఏ భాషలో అయినా ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఉందంటే ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇక బాక్సాఫీస్ వార్ అంటే చెప్పేదేముంది. మేకర్స్ కంటే ఫ్యాన్స్ హడావిడీ ఎక్కవగా ఉంటుంది. కోలీవుడ్ లో ఫ్యాన్ వార్ ఉన్నట్టుగా కంట్రీలో మరెక్కడా కనిపించదు. ఆ రేంజ్ లో ఉంటుంది. ప్రధానంగా విజయ్, అజిత్ కలిసి బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారంటే అభిమానుల బూతులతో సోషల్ మీడియా హీటెక్కిపోతుంది. అంత దిగజారుడుగా కనిపిస్తారు కొందరు ఫ్యాన్స్. మరీ అంత కాదు కానీ.. నెక్ట్స్ బాక్సాఫీస్ వార్ అజిత్, సూర్య మధ్య జరగబోతోంది.
సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అజిత్ కు కూడా కొంత వరకూ ఫర్వాలేదు అనిపించే అభిమానులున్నారు. బట్ కోలీవుడ్ లో సూర్య కంటే అజిత్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. అలాంటి ఇద్దరు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. అందుకు వచ్చే దసరా వేదిక కాబోతోంది. యస్ దసరా బరిలో సూర్య కంగువాతో పాటు అజిత్ నటించిన విడాముయర్చి మూవీస్ విడుదల కాబోతున్నాయి.
వీరితో పాటు రజినీకాంత్ వేట్టయాన్ కూడా అదే టైమ్ కు అనుకున్నారు. కానీ కోలీవుడ్ లో బిగ్ క్లాష్ అవుతుందని రజినీకాంత్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. దీంతో పోటీ ఈ ఇద్దరి మధ్యే ఉండబోతోంది. కంగువాతో సూర్య ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాడు. దీంతో పాటు కోలీవుడ్ లో అజిత్ ను బీట్ చేయగలిగితే అక్కడ అతని రేంజ్ మారుతుంది. అజిత్ కు ఎలాగూ ప్యాన్ ఇండియా మార్కెట్ లేదు.. అతనికీ ఇంట్రెస్ట్ లేదు. సో.. ఇక్కడ తను తన స్థానం నిలబెట్టుకుంటూ కంగువాను బీట్ చేస్తే ఫ్యాన్స్ కు అది చాలు. బట్ కాంపిటీషన్ మాత్రం స్ట్రాంగ్ గానే ఉంటుంది. మరి ఈ టఫ్ కాంపిటీషన్ లో ఖలేజా చూపించేది ఎవరో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com