Vijay : ఆ హీరో లేకపోతే విజయ్ ఇండస్ట్రీకి వచ్చేవాడే కాదట..!

Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా విజయ్ ఖాతాలో ఫ్లాప్స్ లేవు. మిక్స్‌డ్ టాక్ వచ్చినా కూడా విజయ్ సినిమాలు కలెక్షన్ల పరంగా లాభాల్లోకి దూసుకుపోతాయి. ఇక త్వరలోనే 'బీస్ట్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్.
♦ విజయ్ తమిళ్ స్టార్ హీరో రజనీకాంత్ కి పెద్ద అభిమాని.. 1985లో రజనీ నటించిన నాన్ శివప్పు మనితన్ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు .
♦ రజనీకాంత్ లేకపోతే తానెప్పుడూ తమిళ సినిమాల్లోకి వచ్చేవాడిని కాదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు విజయ్.. రజనీకాంత్ హిట్ చిత్రం అన్నామలై సినిమా నుంచి ఓ సీన్ ని ఆడిషన్ ఇచ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడట విజయ్.
♦ విజయ్ తన 2 సంవత్సరాల వయస్సులో మరణించిన తన సోదరి విద్యాచంద్రశేఖర్‌ని అమితంగా ఇష్టపడేవాడు.. అందుకే అతని నిర్మాణ సంస్థ పేరు కూడా VV, విద్యా-విజయ్ ప్రొడక్షన్స్ అని ఉంటుంది.
♦ టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత కేరళలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మలయాళీయేతర నటుడు విజయ్ మాత్రమే కావడం విశేషం.
♦ తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో 60 సినిమాలు చేసిన విజయ్ దాదాపు 20 మంది దర్శకులను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.
♦ విజయ్ భార్య పేరు సంగీత.. కొడుకు పేరు కొడుకు పేరు సంజయ్.. భార్యలోని మొదటి అక్షరం, తన లోని రెండు చివరి అక్షరాలతో సంజయ్ అని పేరు పెట్టారు.
♦ 2007లో, తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశేష కృషికి గానూ డాక్టర్ ఎంజీఆర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com