Dhanush : ధనుష్ వల్ల సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్న కోలీవుడ్

Dhanush : ధనుష్ వల్ల సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్న కోలీవుడ్
X

స్టార్ హీరోలకు ఓ వెసులుబాటు ఉంటుంది. వారిని ఎవరూ పెద్దగా ప్రశ్నించరు. ప్రశ్నించే ధైర్యం కూడా చేయలేని వారు ఉంటారు. ముఖ్యంగా నిర్మాతలు. ముందుగా ఆ హీరో తమకే సినిమా చేయాలని కాకుండా ఎప్పుడు చేసినా ఓకే కానీ ముందుగా ఈ అడ్వాన్స్ ఉంచుకో అంటూ కొంత మొత్తం చేతిలో పెడతారు. స్టార్ హీరోలు కాబట్టి అది పెద్ద అమౌంటే అయి ఉంటుంది. అలా తీసుకున్న వాళ్లు ఏళ్లు గడుస్తున్నా ఈ నిర్మాతలను పట్టించుకోరు. పైగా వెనక వచ్చిన వారికి సినిమాలు చేస్తుంటారు. ఇలాంటి వాళ్లు అన్ని భాషల్లోనూ ఉన్నారు. కానీ చర్యలు తీసుకోవాలంటే కోలీవుడ్ తర్వాతే ఎవరైనా అని చాలా నిర్ణయాలు ఇప్పటికే చూశాం. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు... కోలీవుడ్ చలన చిత్ర నిర్మాతల మండలి వాళ్లు.

ఈనిర్ణయం ప్రకారం.. అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయని నటులపై కొరడా ఝలిపిస్తారట. అదెలా అంటారా.. ఆగస్ట్ 15 తర్వాత నుంచి కొత్త సినిమాల షూటింగ్స్ జరగవు. ఏ హీరో అయితే ముందుగా అడ్వాన్స్ తీసుకుని కమిట్ అయిన సినిమా ఉందో అది పూర్తయ్యే వరకూ కొత్త సినిమా అన్న మాట వినిపించకుండా చేస్తారట. అలాగే ఇప్పటి వరకూ ఏ నిర్మాతలు ఎవరికి ఎంత అడ్వాన్స్ లు ఇచ్చారు.. ఎంత మొత్తం పెండింగ్ లో ఉంది అనే వివరాలను అందరు నిర్మాతల నుంచి తీసుకుంటోంది మండలి.

అలాగే ఇక నుంచి ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాకు కాల్షీట్స్ ఇచ్చేలా స్పష్టమైన విధి విధానాలు రూపొందించబోతున్నారట. అన్నిటికీ మించి హీరోలుు, హీరోయిన్లు ఇకపై అడ్వాన్స్ లే తీసుకోకూడదు అన్న కఠిన నిర్ణయ అమలు చేస్తారట. మరి దీనంతటికీ కారణం ఏంటో తెలుసా.. ధనుష్. మనోడు ఇప్పటికే చాలా అడ్వాన్స్ లు తీసుకున్నాడు. కానీ ఏ ప్రాజెక్ట్ నూ ఆర్డర్ లో చేయడం లేదు సరికదా.. ఆయా నిర్మాతలకు అందుబాటులో కూడా ఉండకుండా ఇబ్బంది పెడుతున్నాడట.

ఇలాంటి వారు గతంలో కూడా ఉన్నారు. అయినా ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటో కానీ.. కోలీవుడ్ ఇలాంటి సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కొత్తేం కాదు. రీసెంట్ గా కూడా విశాల్ పై బ్యాన్ విధిస్తాం అన్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి నన్నాపలేరు అని అతను కౌంటర్ ఇచ్చాడు. మరి ఈ వ్యవహారం ఏ మలుపులు తిరుగుతుందో కానీ.. నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వకపోతే హీరోలు కూడా అడగరు కదా.

Tags

Next Story