RRR Movie: RRR నుంచి 'కొమ్మ ఉయ్యాల్లో' పాట వచ్చేసిందోచ్..!

RRR : ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకున్న RRR మూవీలోని కొమ్మ ఉయ్యాల వీడియో సాంగ్ వచ్చేసింది. ఫుల్ వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. సద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. చిన్నారి ప్రకృతిరెడ్డి మూడు భాషల్లో పాడి శభాష్ అనిపించుకుంది. ఇటీవల టీవీ5 ఇంటర్వ్యూలో ఈ పాట పాడిన ప్రకృతి రెడ్డి.. అందరినీ ఆకట్టుకుంది. . సినిమాలో బ్రిటీష్ దొరసాని చేతికి డిజైన్ చేస్తూ మల్లి అనే పాత్ర ఈ పాటను ఆలపిస్తుంది. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమాలో తారక్,చరణ్ కలిసి నటించారు. తారక్ కొమురం భీం గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ సినిమా మార్చి 25న భారీ అంచనాల నడుమ రిలీజై కాసుల వర్షం కురిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో రూపొందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com