Konchada Srinivas: టాలీవుడ్‌లో మరో విషాదం.. అనారోగ్యంతో నటుడు మృతి

Konchada Srinivas: టాలీవుడ్ సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కొంచాడ శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతను 40కి పైగా సినిమాల్లో, 10కి పైగా టీవీ సీరియళ్లలో నటించాడు.
గతంలో షూటింగ్ సమయంలో కిందపడి శ్రీనివాస్ ఛాతీకి గాయమైందని, ఆ తర్వాత గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నటుడు శ్రీనివాస్‌కు తల్లి విజయలక్ష్మి. ఐదేళ్ల క్రితం తండ్రి చనిపోయాడు. తమ్ముడు కూడా పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు సోదరీమణులు వివాహం జరిగింది.
కొంచాడ శ్రీనివాస్ ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, నచ్చావులే, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.శ్రీనివాస్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com