Kondapolam Novel: కొండపొలంలో హీరోయిన్ లేదట..!

Kondapolam Novel: పుస్తకాల కథలు నచ్చి వాటితోనే సినిమాలు తీయడం దర్శకులకు కొత్తేమీ కాదు. అలా వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాయి కూడా. పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపించని వాళ్లు కూడా సినిమాలు చూడడానికి ఇష్టపడతారు కాబట్టి వారికి ఎన్నో కథలు చేరువయ్యే అవకాశం ఉంది. అందుకే పుస్తక రచయితలు కూడా తమ కథలతో సినిమాలు తీస్తానంటే నో చెప్పలేరు.
అలా ఒక నవల ఆధారంగా తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే కొండపొలం. మనసుకు హత్తుకుపోయే కథలను రాయడంలో గుర్తింపు తెచ్చుకున్న రచయిత 'సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి'. ఆయన 2019లో రచించిన నవలే 'కొండపొలం'. ఇది నల్లమల అడవుల్లో గొర్రెలను ఇతర క్రూర మృగాల నుండి కాపాడుకునే ఒక యువకుడి కథ. గొర్రెలను కాపాడుకోవడం కోసం ఆ యువకుడు ఎంత కష్టపడ్డాడు. తనకు ఆ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనేది కథ.
అయితే ఈ నవలలో హీరోయిన్ పాత్ర లేకపోయినా సినిమాలో యాడ్ చేశారు. అందుకోసం రకుల్‌ను తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రిష్ గతంలోనే స్పష్టం చేశాడు. వికారాబాద్ అడవుల్లోనే దాదాపు చిత్ర షూటింగ్ పూర్తి చేసారు దర్శక నిర్మాతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com