ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఎన్టీఆర్ 30కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్- సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది.

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్- సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. RRR తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుంది. తారక్‌ పుట్టినరోజు కానుకగా NTR30 నుంచి సరికొత్త ఫొటోని షేర్‌ చేయడంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌ని కన్ఫాం చేసినట్లు సమాచారం. NTR30 సినిమాకి యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మూవీ యూనిట్ అతడితో సంప్రదింపులు జరపగా అనిరుధ్‌ ఓకే చెప్పినట్లు టాక్. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధా ఆర్ట్స్‌ పతాకలపై నందమూరి కళ్యాణ్, సుధాకర్‌ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ ఏకంగా రూ. 4.50 కోట్లు డిమాండ్ చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అనిరుధ్ అడిగిన మొత్తాన్ని చెల్లించేందుకు చిత్ర యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ మూవీ పాన్‌ ఇండియా మూవీగా వచ్చే సంవత్సరం 2022 ఏప్రిల్‌ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే ప్రకటన ఇచ్చేశారు కొరటాల శివ. 'జనతా గ్యారేజ్‌' రూపంలో సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాల- ఎన్టీఆర్ కాంబో మరోసారి రిపీట్ అవుతోంది. ప్రస్తుతం కొరటాల చిరంజీవితో చేస్తున్న 'ఆచార్య' మూవీ షూటింగ్ తో బీజీగా ఉన్నాడు.

Tags

Next Story