Anasuya Bharadwaj: అనసూయ మంచి నటే.. కాని ఆమె డ్రెస్సింగే.. : కోట శ్రీనివాసరావు

Anasuya Bharadwaj (tv5news.in)
Anasuya Bharadwaj: నచ్చిన పని చేయడానికి, అనుకుంది అనుకున్నట్టుగా బోల్డ్‌గా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. వెండితెర నటి అయినా, బుల్లితెర యాంకర్ అయినా.. ఇలా బోల్డ్‌గా మాట్లాడే వారు చాలా తక్కువమంది ఉంటారు. అందులో ఒకరు అనసూయ భరద్వాజ్. ఎప్పుడూ బుల్లితెరపై కనిపిస్తూ.. అప్పుడప్పుడు వెండితెరపై అలరిస్తూ.. అనసూయ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటుంది. తాజాగా సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనసూయపై కామెంట్స్ చేశారు. ఇప్పుడు నెట్టింట్లో ఇదే హాట్ టాపిక్.
అనసూయకు పెళ్లైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా జరిగిన తర్వాతే తనకు యాంకర్‌గా బ్రేక్ వచ్చింది. అందుకే తన పర్సనల్ లైఫ్‌ను, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తుంటుంది అనసూయ. అయితే యాంకర్ అన్న తర్వాత ఇలాంటి బట్టలే వేసుకోవాలి అని ఎవరూ రూల్ పెట్టలేదు అనుకునే అనసూయ తన డ్రెస్సింగ్ స్టైల్‌తో ఎప్పుడూ ఆకట్టుకునే ప్రయత్నమే చేస్తోంది. కానీ దానివల్లే ఎక్కువగా విమర్శలు కూడా ఎదుర్కుంటుంది. అదే డ్రెస్సింగ్ స్టైల్‌పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కూడా ఇటీవల కామెంట్ చేశారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారని ఆయన అన్నారు. అందుకే అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదని మనసులో మాట బయటపెట్టారు కోట శ్రీనివాసరావు. అనసూయ చక్కటి నటి కానీ ఆమె డ్రెస్సింగ్ తనకు నచ్చదని తేల్చి చెప్పారు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని అంటున్నాను అని పేర్కొన్నారు. ఒక పాపులర్ యాంకర్ డ్రెస్సింగ్ గురించి కోట శ్రీనివాసరావు మట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com