Kota Srinivasa Rao: నాగబాబును కోట శ్రీనివాసరావు అలా అనేశారేంటి..?

Kota Srinivasa Rao: మా ఎన్నికలు మనం ఇష్టపడే నటీనటులు ఎందరినో ఒకరికి ఒకరిని దూరం చేశాయి. అధ్యక్ష పోటీలో ఉన్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ మాత్రమే కాకుండా వారి ప్యానెల్ల సభ్యులు, వారికి మద్దతిస్తున్న వారు కూడా ఒకరిని ఒకరు దూషించుకోవడం లాంటివి చాలా జరిగాయి. అదే సమయంలో ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తు్న్న మెగా బ్రదర్ నాగబాబు.. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావును కామెంట్ చేసారు.
నాగబాబు చేసిన కామెంట్స్ చాలా వైరల్‌గా మారాయి. అంతటి సీనియర్ నటుడి గురించి అలా ఎలా మాట్లాడగలుగుతారు అని నెటిజన్లు కూడా ఆయనను విమర్శించారు. కానీ ఆ సమంయలో కోట శ్రీనివాస రావు ఈ కామెంట్స్‌పై స్పందించలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నాగబాబుపై తన అభిప్రాయాన్ని బయటపెట్టడమే కాకుండా, తన కామెంట్స్‌కు కౌంటర్‌ను ఇచ్చారు కోట శ్రీనివాసరావు.
నాగబాబు అసలు ఎవరు అని ఇంటర్వ్యూలో ప్రశ్నించారు కోట శ్రీనివాసరావు. పవన్ కళ్యాణ్, చిరంజీవి లేకపోతే నాగబాబు ఎవరు అని ఆయన అన్నారు. వీరిద్దరికి మెగా బ్రదర్‌గానే తనకు గుర్తింపు ఉంది తప్పా.. తాను ఒక మంచి నటుడు కాదు, రాజకీయనాయకుడు కాదని విమర్శించారు. తాను అబద్ధాలు ఏమీ చెప్పట్లేదని.. ఇదంతా నిజమే అన్నారు కోట శ్రీనివాసరావు.
ఇక మా ఎన్నికల సమయంలో కోట శ్రీనివాస రావు మంచు విష్ణుకు మద్దతునివ్వడం మాత్రమే కాకుండా ప్రకాశ్ రాజ్‌పై కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్ ఎప్పుడూ సెట్‌కు టైమ్‌కు రాడని, తనకు సమయపాలన లేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com