Kovai Sarala : సీరియస్ లుక్ లో కోవై సరళ.. గుర్తుపట్టలేనంతగా..!

Kovai Sarala :  సీరియస్ లుక్ లో కోవై సరళ.. గుర్తుపట్టలేనంతగా..!
X
Kovai Sarala : తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకి చాలా దగ్గరైంది కోవై సరళ.. సినిమాల్లో ఎంతమంది కమెడియన్లు ఉన్నప్పటికీ ఆమె కామెడీ ట్రాక్ చాలా స్పెషల్ గా ఉంటుంది.

Kovai Sarala : తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకి చాలా దగ్గరైంది కోవై సరళ.. సినిమాల్లో ఎంతమంది కమెడియన్లు ఉన్నప్పటికీ ఆమె కామెడీ ట్రాక్ చాలా స్పెషల్ గా ఉంటుంది. అయితే చాలాకాలంగా తెలుగు సినిమాలకి దూరంగా ఉంటుంది. తాజాగా ఆమె నటించిన తమిళ మూవీ సెంబి నుంచి స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో ఆమె లుక్ చాలా కొత్తగా ఉంది. ఎవరు గుర్తుపట్టనంతగా ఆమె ఉంది.

రఫ్ లుక్ లో తలకు క్లాత్ కట్టుకొని, చిన్నారిని అక్కున చేర్చుకొని దీన స్థితిలో ఉన్నట్లు కనిపించింది. అరణ్య ఫేమ్ ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆమె 70 ఏళ్ల వృద్దురాలుగా నటిస్తోంది. ఓ బస్సు నేపధ్యంలో 24 మంది ప్రయాణికుల చుట్టూ ఈ కథ నడుస్తోందని, ఇందులో కోవై సరళ సీరియస్ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. తంబి రామ‌య్య, అశ్విన్ కుమార్‌తోపాటు చైల్డ్ ఆర్టిస్ట్ నీల ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు.

Tags

Next Story