Krishna Vamsi : గౌతమ్‌తో మురారి సీక్వెల్ వార్తలు అవాస్తవం: కృష్ణవంశీ

మహేశ్‌బాబు నటించిన ‘మురారి’ ఇటీవల రీరిలీజ్‌లోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. దీంతో సూపర్ స్టార్ కొడుకు గౌతమ్‌తో సీక్వెల్ రాబోతున్నట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ వార్తలను డైరెక్టర్ కృష్ణవంశీ ఖండించారు. సీక్వెల్ ఆలోచన లేదని Xలో స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం గౌతమ్ లండన్‌లో యాక్టింగ్‌పై శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో క్లాసిక్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మురారి’ని ఇటీవల రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు మరోసారి క్యూ కట్టడంతో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇక ఈ సినిమాలో మహేష్ క్లాస్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో అందాల భామ సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com