Ranga Marthaanda: ఓటీటీలో 'రంగమార్తాండ'..

Ranga Marthaanda: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన రంగమార్తాండ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఈ చిత్రంలో నటించారు అనడం కంటే జీవించారు అని అనడం బావుంటుంది. కామెడీ యాక్టర్‌గా కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం కన్నీళ్లు కూడా పెట్టించలను అని నిరూపించారు. మరాఠీ సినిమా నట సామ్రాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గత నెలలో థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ రోజు నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నేటి నుంచి స్ట్రీమ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే..
రంగస్థలంపై ఎన్నో పాత్రలకి జీవం పోసిన రాఘవరావు (ప్రకాశ్ రాజ్)కు రంగ మార్తాండ బిరుదును ప్రదానం చేస్తారు. అతని స్నేహితుడు బ్రహ్మానందం కూడా రంగ స్థల నటుడే.. ఇద్దరూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటారు. నాటక రంగం నుంచి నిష్క్రమించిన రాఘవరావు నిజ జీవితం ఎలా ఉంటుంది.. జీవితం అనే నాటకరంగంలో గెలిచాడా లేదా అనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు కృష్ణవంశీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com