Krishnam Raju : రాజకీయాల్లోనూ రాణించిన కృష్ణం రాజు..

Krishnam Raju : కృష్ణంరాజు రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు చేతిలో ఓడిపోయారు. తర్వాత కొద్ది రోజులు మళ్లీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఐతే బీజేపీ ఆహ్వానంతో మళ్లీ 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాకినాడ ఎంపీ స్థానం నుంచి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు.
1999లో జరిగిన ఎన్నికల్లో నర్సాపురం నుంచి లోక్‌సభ నుంచి పోటీ చేసి రెండో సారి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై లక్షా 65 వేల రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. దీంతో వాజ్‌పేయి సర్కార్‌లో కేంద్రమంత్రిగా అవకాశం దక్కింది. 2004 ఎన్నికల్లో మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి చేగొండి హరిరామజోగయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com