Krishnam Raju: రెబెల్ స్టార్ స్పైసీ లుక్.. లవ్లీ పోజ్.. అభిమానులు ఫుల్ ఖుషీ..

Krishnam Raju (tv5news.in)
Krishnam Raju: 190కి పైగా సినిమాల్లో నటించి.. తన తర్వాత తన సినీ జీవితానికి వారసుడిగా ప్రభాస్‌లాంటి పాన్ ఇండియా స్టార్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసిన నటుడు కృష్ణంరాజు. ఒకప్పుడు సినిమాల్లో కృష్ణలాంటి హీరోలకు పోటీగా తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్నారు కృష్ణంరాజు. సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకున్న తర్వాత ఈయన అభిమానులకు అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. తాజాగా ఈయన పెట్టిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్‌గా మారుతోంది.
గతకొంతకాలంగా కృష్ణంరాజు.. సినిమాల్లో కూడా ఎప్పుడూ కనిపించనంతగా స్టైలిష్‌గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రభాస్‌తో కలిసి చేసిన 'రెబెల్' సినిమాలో కృష్ణంరాజు లుక్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ఫోటోషూట్‌లో కూడా కృష్ణంరాజు చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఈ స్టైలిష్ లుక్‌కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
1966లో 'చిలకా గోరింకా' అనే చిత్రంతో నటుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కృష్ణంరాజు.. హీరోగానే కాకుండా విలన్‌గా కూడా తనదైన ముద్రను వేశారు. 1996లో ఆయన కెరీర్ పీక్‌లో ఉన్న సమంయలోనే కృష్ణంరాజు.. శ్యామలా దేవిని పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణంరాజు తన భార్యతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కృష్ణంరాజు పోస్ట్ చేసిన ఈ ఫోటోలో వీరిద్దరు మళ్లీ పాతికేళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టుగా కనిపిస్తున్నారు. ఆయన ఫ్యాన్స్ నుండి, ప్రభాస్ ఫ్యాన్స్ నుండి ఈ జంటకు యానివర్సరీ విషెస్ వెల్లువెత్తాయి. ఎంతైనా కృష్ణంరాజును ఇలాంటి స్టైలిష్ లుక్‌లో చూస్తే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు ఆయన అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com