Krithi Shetty : బంపర్ ఆఫర్ కొట్టేసిన కృతి
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. కానీ, ఉప్పెన అందించిన సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. ఇటీవలే మలయాళ స్టార్ టోవినో థామస్ తో పాన్ ఇండియా సినిమా చేసింది. ఆ సినిమాతో చాలా కాలం తరువాత హిట్ ట్రాక్ ఎక్కింది కృతి. తాజా మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ. అదేంటంటే.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ కొత్త సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టిని తీసుకున్నారట మేకర్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుందని సమాచారం. మరి చాలా కాలాం తరువాత కృతి శెట్టి తెలుగులో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com