krithi shetty : మాటిస్తున్నా.. మంచి పాత్రల్లో నటిస్తా: కృతి ఎమోషనల్ పోస్ట్
krithi shetty : వైష్ణవ్ తేజ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఉప్పెన.. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైంది ముద్దుగుమ్మ కృతిశెట్టి.. బేబమ్మగా నటించి అందరి మనసులు గెలుచుకుంది కృతి.. నేటితో ఈ చిత్రానికి ఏడాది పూర్తి అయింది. ఈసందర్భంగా కృతిశెట్టి తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది.
'' మన జీవితంలో మనకంటూ రెండు పుట్టిన రోజులు ఉన్నట్లైతే.. అందులో ఒకటి... మనం పుట్టినరోజు. ఇంకొకటి.. మనం కెరీర్‌లో ఏం చేయాలో ఎంచుకున్న రోజు. ఏడాది క్రితం నటిగా పరిశ్రమలో అడుగుపెట్టా. నేను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నా.. కాబట్టి ఈరోజు నాకిది మరో పుట్టినరోజుగా భావిస్తున్నా. నేను ప్రేమించే పనిని చేయడం.. అందుకు మీరంతా పాజిటివ్‌గా స్పందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈ ప్రయాణాన్ని గుర్తుండేలా చేసిన నా అభిమానులకు కృతజ్ఞతలు. ఇక పై మరింత కష్టపడి మంచి పాత్రలతో అలరిస్తానని మాట ఇస్తున్నా. థాంక్యూ ఆల్'' అని రాసుకొచ్చింది.
ఈ సినిమా తర్వాత కృతిశెట్టి రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఉప్పెన తర్వాత శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టింది కృతిశెట్టి. ప్రస్తుతం సుధీర్ బాబు అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్ వారియర్, నితిన్‌తో మాచర్ల నియోజకవర్గం చిత్రాలతో బిజీగా ఉంది కృతి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com