Krithi Shetty : కృతిశెట్టి అక్కడైనా సెటిల్ అవుతుందా..?

తెలుగులోకి ఉప్పెనలా వచ్చి కెరటంలా వెనక్కి వెళ్లిపోయిన బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ మూవీతోనే కుర్రాళ్లకు జ్వరం తెప్పించిన ఈ బేబమ్మ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. బట్ అవన్నీ బాక్సాఫీస్ వద్ద పోయాయి. దీంతో కొత్త ఆఫర్సే కనిపించడం లేదిప్పుడు. లాస్ట్ ఇయర్ వచ్చిన ఒకే ఒక్క మూవీ మనమే కూడా డిజాస్టర్ అయింది. దీంతో మకాం కోలీవుడ్ కు మార్చింది. అక్కడ బానే మూడు సినిమాలు చేస్తోందిప్పుడు. ఇవన్నీ కాస్త ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. పైగా వీటిలో ఒకటి కార్తీ సరసన కూడా ఉంది.
నాలన్ కుమారస్వామి డైరెక్షన్ లో కార్తీ సరసన నటిస్తోన్న ‘వా వాతియార్’పై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఇప్పటికే కోలీవుడ్ లో పాజటివ్ వైబ్స్ తెచ్చుకుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఓ పాటలో కృతిశెట్టి డ్యాన్స్ మూవ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని సమ్మర్ లోనే విడుదల చేయబోతున్నారు. తర్వాత లేటెస్ట్ కోలీవుడ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ సరసన నయనతార భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(LIK) లో నటిస్తోంది. ఈ మూవీపైనా అంచనలున్నాయి.
ఇక రవి మోహన్ (జయం రవి) సరసన ‘జీనీ’ అనే సినిమాలో నటిస్తోంది కృతిశెట్టి. ఈ మూడు ప్రాజెక్ట్స్ లోనూ తను ఓన్లీ హీరోయిన్. ఇంకే హీరోయిన్ తోనూ స్క్రీన్ షేర్ చేసుకోవడం లేదు. సో.. వీటిలో ఏ రెండు హిట్ అయినా కోలీవుడ్ లో పాగా వేసే అవకాశాలున్నాయి. మరి అమ్మడి లక్ ఎలా ఉందో కానీ.. కనీసం కోలీవుడ్ లో అయినా సెటిల్ అవుతుందో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com