సినిమా

Krithi Shetty: కెరీర్ మొదట్లోనే అలాంటి సినిమానా..!

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమా ఏ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Krithi Shetty (tv5news.in)
X

Krithi Shetty (tv5news.in)

Krithi Shetty: 'ఉప్పెన' సినిమా ఏ అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కలెక్షన్ల విషయంలో, టాక్ విషయంలో కొత్త సంచలనాన్నే సృష్టించింది. చూడడానికి ఇదొక స్వచ్ఛమైన ప్రేమకథ. కానీ ఇందులో మిగతా ప్రేమకథల్లో లేని ఒక కొత్త ఎలిమెంట్‌ను మనకు చూపించాడు దర్శకుడు బుచ్చిబాబు. ఇక తాను రాసుకున్న బేబమ్మ పాత్రకు ప్రాణం పోసింది కృతి శెట్టి. ప్రస్తుతం తన కెరీర్‌ను మలుచుకునే ప్రయత్నంలో పలు డేరింగ్ స్టెప్స్‌నే తీసుకుంటోంది.

ఉప్పెన విడుదల కాకముందే కృతి శెట్టి పలు తెలుగు సినిమా ఆఫర్లను దక్కించుకుంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్స్‌లోనే బిజీగా గడిపేస్తోంది. అవి మాత్రమే కాకుండా ఒకేసారి కృతిని మరిన్ని మూవీ ఆఫర్లు కూడా పలకరించాయి. కానీ తన కాల్ షీట్లు ఖాళీ లేక మరే ఇతర సినిమాకు సైన్ చేయలేకపోయింది. ఇప్పుడు ఈ షూటింగ్స్ అన్నీ చివరిదశకు చేరుకున్నాయి. అందుకే మరికొన్ని స్టోరీలను లైన్‌లో పెట్టే ప్రయత్నం చేస్తోంది కృతి.

ప్రస్తుతం కృతికి మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. అందులోనూ.. ఒక్క సినిమానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతలోనే కృతికి లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసే అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. 'ఉయ్యాల జంపాలా', 'మజ్ను'లాంటి ఫీల్ గుడ్ చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ.. కృతిని దృష్టిలో పెట్టుకుని ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేశాడట. ఈ సినిమాకు సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES