Krithi Shetty: బోల్డ్ సీన్స్‌పై కృతి శెట్టి హాట్ కామెంట్స్..

Krithi Shetty (tv5news.in)
Krithi Shetty: కొందరు హీరోయిన్లు బోల్డ్ సీన్స్‌కు దూరంగా ఉంటారు. మరికొందరు మాత్రం అది కేవలం ప్రొఫెషన్‌లో భాగమని భావించి చేస్తారు. కానీ అలాంటి వారు ఎక్కువగా ట్రోల్స్‌కు గురవుతూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ట్రోలింగ్స్‌కు గురవుతున్న ఓ హీరోయిన్ ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.
'ఉప్పెన' చిత్రంతో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కృతి శెట్టిని ఫస్ట్ లుక్ నుండే చాలామంది ఇష్టపడడం మొదలుపెట్టారు. అందుకే తన గురించి వివరాలను తెలుసుకోవడం మొదలుపెట్టారు. అప్పుడే తన వయసు ఇంకా 18 సంవత్సరాలే అని తెలుసుకుని షాక్ అయ్యారు. అయినా అంత వయసులో అంత మంచి నటనను కనబరచినందుకు కృతిని అందరూ మెచ్చుకున్నారు కూడా. కానీ రెండో సినిమాకే ఈ ఇమేజ్ అంతా మారిపోయింది.
ఉప్పెన విడుదల కాకముందే నేచురల్ స్టార్ నాని సరసన 'శ్యామ్ సింగరాయ్' చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది కృతి శెట్టి. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ను అందుకుంటోంది. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుండి కృతి శెట్టిపై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఏర్పడింది. దానికి కారణం ఈ మూవీలో తన క్యారెక్టరైజేషన్.
శ్యామ్ సింగరాయ్ ట్రైలర్‌లో కృతి సిగరెట్ తాగుతూ, నానితో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది. తన వయసుకు, తాను చేస్తున్న పాత్రలకు సంబంధం లేదంటూ తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. అయితే వీటిపై కృతి స్పందించింది. యాక్షన్ సీన్స్ చేయడానికి ఎలా కష్టపడతామో.. బోల్డ్ సీన్స్ చేయడానికి కూడా అలాగే కష్టపడతామని చెప్పింది. ప్రొఫెషన్‌లో ఇవన్నీ భాగమని తెలిపింది. అయితే బోల్డ్ సీన్స్ అవసరమనిపిస్తేనే చేస్తానని.. లేకపోతే చేయనని చెప్పేస్తానని స్పష్టం చేసింది కృతి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com