Krithi Shetty: కోలీవుడ్‌లోకి బేబమ్మ.. స్టార్ హీరో సినిమాతో..
Krithi Shetty (tv5news.in)
Krithi Shetty: ప్రస్తుతం ఉప్పెన బ్యూటీ కృతి శెట్టికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరో, యంగ్ హీరో అని తేడా లేకుండా అందరితో జతకడుతూ డేట్లు ఖాళీ లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న యంగ్ బ్యూటీలలో కృతి శెట్టికి ఉన్న హవా ఎవరికీ లేదనే అనిపిస్తోంది. ఈ బేబమ్మ త్వరలో టాలీవుడ్ నుండి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్‌లో బిజీ అయిన కృతి శెట్టికి ఇతర ఇండస్ట్రీలో నుండి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. కోలీవుడ్ నుండి ఇప్పటికీ బేబమ్మకు పలు ఆఫర్లు వచ్చినా.. తెలుగులోనే బిజీ కావడంతో.. వేరే ఆఫర్లను యాక్సెప్ట్ చేయకపోతోంది. తాజాగా కృతికి కోలీవుడ్ నుండి కాదనలేని ఆఫర్ వచ్చిందని టాక్. అది కూడా స్టార్ హీరో సూర్య సరసన అని సమాచారం.
తాజాగా 'ఈటీ' అనే సినిమాతో సూర్య ప్రేక్షకులను పలకరించాడు. ఎప్పటిలాగానే తన ఎమోషనల్ యాక్టింగ్‌తో అందరినీ కట్టిపడేసే సూర్య.. 'ఈటీ'తో మరోసారి ఇంప్రెస్ చేశాడు. అయితే సూర్య అప్‌కమింగ్ చిత్రం బాలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా అనుకుంటున్నారని టాక్. ఒకవేళ ఈ సినిమాను ఓకే చేస్తే.. కృతికి మంచి డెబ్యూ దొరుకుందని అనుకుంటున్నారు అభిమానులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com