Krithi Shetty Remuneration: సూర్య సినిమాలో కృతి శెట్టి.. భారీ రెమ్యునరేషన్ డిమాండ్..
Krithi Shetty (tv5news.in)
Krithi Shetty Remuneration: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమయ్యి ఎక్కువకాలం కాలేదు. కానీ ఇంతలోనే కోలీవుడ్ నుండి కూడా ఛాన్సులు కొట్టేస్తోంది కృతి శెట్టి. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న యంగ్ హీరోయిన్లలో కృతి శెట్టికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అని తేడా లేకుండా అందరి సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తున్న కృతి కోలీవుడ్ ఎంట్రీకి భారీ పారితోషికాన్నే డిమాండ్ చేసినట్టు టాక్.
గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో సూర్య పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా అయిపోయింది. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్న సూర్య.. దర్శకుడు బాలాతో తన 41వ సినిమాను ప్లాన్ చేశాడు. ఇటీవల ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించింది టీమ్. అయితే ముందుగా రూమర్స్‌లో వినిపించినట్టుగానే కృతి శెట్టినే ఇందులో హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. కానీ ఈ సినిమాలో నటించడానికి కృతి భారీ రెమ్యునేషన్నే డిమాండ్ చేసిందట.
• @IamKrithiShetty on Board for #Suriya41 @Suriya_offl | #DirBala pic.twitter.com/028rkrTpfJ
— #Suriya41 (@FilmSuriya41) March 28, 2022
మొదటి సినిమా 'ఉప్పెన' కోసం కృతి శెట్టి 50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో తన రెమ్యునరేషన్‌ను ఏకంగా రెండు కోట్లకు పెంచేసిందట ఈ భామ. నాగార్జున, నాగచైతన్య మల్టీ స్టారర్ 'బంగార్రాజు'లో నటించడానికి కృతి రూ. 2 కోట్ల పారితోషికం తీసుకుందట.
అయితే తన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని కోలీవుడ్‌లో ఫస్ట్ మూవీ అయినా కూడా సూర్యలాంటి యాక్టర్‌తో నటించడానికి రూ. 1.5 కోట్లు తీసుకుంటుందట కృతి. ప్రస్తుతం కృతి శెట్టి రెమ్యునరేషన్ సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com