Krithi Shetty : హిట్టు కొట్టిన కృతి శెట్టి
X
By - Manikanta |21 Sept 2024 10:30 PM IST
ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కృతి శెట్టి ఆ తరువాత ఆ సక్సెస్ ను కంటిన్యూ చేయలేకపోయింది. వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కించుకోలేకపోయింది. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే మలయాళంలో ఆమె నటించిన అజయంతే రాండమ్ మోషణం (ARM) విడుదల అయ్యింది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన యాక్షన్-అడ్వెంచర్ మూవీలో టోవినో థామస్ హీరోగా నటించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది. ఇప్పటివరకు రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో చాలా కాలం తరువాత హిట్ అందుకుంది కృతి. దాంతో ఈ అమ్మడు సంతోషాన్ని వ్యక్తం చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com