Krithi Shetty : కృతిశెట్టి కొత్త కంపెనీ పెట్టింది..

తెలుగులో ఉప్పెనలా దూసుకు వచ్చిన బ్యూటీ కృతిశెట్టి. ఫస్ట్ మూవీ హిట్ అవడంతో ఆఫర్స్ వెల్లువెత్తాయి. బట్ తర్వాత అన్ని సినిమాలూ వరుసగా పోయాయి. కట్ చేస్తే ఇప్పుడు తన చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. చివరగా వచ్చిన మనమే అయితే మరీ డిజాస్టర్ అయింది. అయితే అమ్మడు అందంగా ఉంది కానీ నటన లేదు. అన్నిటికీ ఒకే ఎక్స్ ప్రెషన్ కావడం కూడా మైనస్ అయింది. తెలుగులో ఆఫర్సేం లేకపోవడంతో ఈ బేబమ్మ ఇక కోలీవుడ్ కు జ్వరం తెప్పిస్తా అని అటు వెళ్లింది. అక్కడ ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. మళయాలంలో ఓ సినిమా చేస్తోంది.
తెలుగులో ఇప్పుడెవరూ పట్టించుకోకపోయినా తమిళ్ లో కార్తీ సరసన ‘వా వాతియార్’ అనే మూవీలో ఆఫర్ పట్టేసింది. ఇది తన కెరీర్ కు కొత్త బూస్టప్ ఇస్తుందనుకుంటున్నారు చాలామంది. దీనికంటే ముందే ఇప్పుడు సడెన్ గా ‘లవ్ ఇన్సూర్ కంపెనీ’(లిక్) అనే మూవీ ఫస్ట్ లుక్ తో వచ్చేసింది. లాస్ట్ ఇయర్ లవ్ టుడే అనే మూవీతో కోలీవుడ్ ను మెస్మరైజ్ చేసిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్నఈ చిత్రాన్ని నయనతార నిర్మిస్తుంటే ఆమె భర్త విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇదే అసలు ట్విస్ట్.
విఘ్నేష్ ఇలాంటి మినీ మూవీస్ తో మాగ్జిమం హిట్స్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. అందుకే అమ్మడికి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు. ఈ మూవీ ఫస్ట్ లక్ పోస్టర్ లో అమ్మడు బార్బీ డాల్ లా కనిపిస్తోంది. గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువే పెంచింది. ఇప్పటి వరకు తెలుగులో ఇలాంటి లుక్ తో కనిపించలేదు. మరి ఈ గ్లామర్ తోనే కోలీవుడ్ కు జ్వరం తెప్పించబోతోందన్నమాట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com