Kriti Sanon : నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ట్రెండ్ అయిపోయింది: కృతి సనన్

తనపై వచ్చిన రూమర్స్ పై ఘాటుగా స్పందించింది కృతి సనన్. నిజానిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారని మడిపడ్డారు. తనకన్నా పదేండ్ల చిన్నవాడితో డేటింగ్ లో ఉన్నట్టు వస్తున్న వార్తలు తనను ఎంతో బాధించాయని చెబుతోంది. యూకేకు చెందిన కబీర్ బహియాతో కృతి డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల కొన్ని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె పుట్టినరోజు వేడుకను కబీర్ తో కలిసి చేసుకున్నారని కూడా ప్రచారం జరిగింది. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. తప్పుడు రాతల వల్ల తనతోపాటు తన కుటుంబం కూడా బాధపడిందని, అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎలాంటి వార్తలైనా సోషల్ మీడియా ద్వారా త్వరగా ప్రజల్లోకి వెళ్తాయన్నారు. 'గతంలో సోషల్ మీడియా లేనప్పుడు వార్తపత్రికల్లో వచ్చింది చూసి ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చేవారు. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రాస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ పెట్టడం ట్రెండ్ అయిపోయింది.’ అంటూ కృతి అసహనం వ్యక్తం చేశారు. నేనొక్కడినే సినిమాతో 2014లో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్.. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్లోనే నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com