Kriti shetty: పవన్ సినిమాలో కృతిశెట్టి.. కానీ ఇక్కడే ట్విస్ట్..!

Kriti shetty: పవన్ సినిమాలో కృతిశెట్టి.. కానీ ఇక్కడే ట్విస్ట్..!
X
Kriti shetty: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టికి ఇప్పుడు టాలీవుడ్‌‌లో మంచి డిమాండ్ ఉంది. ఉప్పెన,శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీలతో హ్యట్రిక్ కొట్టింది ఈ బేబమ్మ.

Kriti shetty: ఉప్పెన బ్యూటీ కృతిశెట్టికి ఇప్పుడు టాలీవుడ్‌‌లో మంచి డిమాండ్ ఉంది. ఉప్పెన,శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు మూవీలతో హ్యట్రిక్ కొట్టిన ఈ బేబమ్మ చేతిలో ఇప్పుడు అరడజన్ సినిమాలున్నాయి. తాజాగా ఈ అమ్మడుకి బంపర్ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇటీవల భీమ్లానాయక్ మూవీతో మంచి హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ తమిళ్‌‌లో మంచి హిట్ అయిన వినోదయ సీతమ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్‌‌తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. అయితే సాయి తేజ్‌‌కి పక్కన హీరోయిన్‌‌గా కృతిశెట్టి ఫైనల్ చేశారట మేకర్స్.

పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించానున్నారని తెలుస్తోంది. ఉగాదికి గ్రాండ్‌‌గా మూవీ లాంచ్ అవ్వనుందట. ఇందులో పవన్ దేవుడిగా కనిపించనున్నాడు. కేవలం 20 రోజుల కాల్షీట్లకి పవన్ 60 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.

Tags

Next Story