రేటు పెంచేసిన బేబమ్మ.. బాబోయ్ ఆ ప్రీక్వెల్‌కు అంత డిమాండా..!

ఒకప్పుడు హీరోల రెమ్యునరేషన్ కంటే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. హీరో అయినా హీరోయిన్ అయినా క్రేజ్‌ను బట్టి రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. సినిమాల్లో అనుభవం ఎంత ఉంది, ఎంతమంది స్టార్ హీరోల సరసన నటించింది అన్న అంశాలను కూడా పక్కన పెట్టి ప్రేక్షకుల్లో ఒక హీరోయిన్‌కు ఉన్న క్రేజ్ చూసి తనకు ఆఫర్లను అందిస్తున్నారు దర్శక నిర్మాతలు.
అలాంటి ట్రెండింగ్ హీరోయిన్లలో ప్రస్తుతం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు కృతి శెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయిన ఈ బేబమ్మ అతి తక్కువకాలంలోనే సీనియర్ హీరోయిన్లకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. మొదటి సినిమాకు కేవలం ఆరు లక్షల పారితోషికం అందుకున్న కృతి.. నానితో నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కోసం 20 లక్షలను డిమాండ్ చేసింది.
ఇక రీసెంట్ గా నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్‌లో నాగచైతన్య సరసన నటించడానికి ఏకంగా రెండు కోట్లు తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. అంతగా పారితోషికాన్ని పెంచేసినా కూడా కృతికి ఆఫర్ల వెల్లువ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదే స్పీడ్‌లో కొనసాగితే బేబమ్మ కొద్దికాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోతుందని సినీ ప్రముఖుల అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com