Bheemla Nayak Pre-Release event : భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా మంత్రి కేటీఆర్..!

Bheemla Nayak Pre-Release event : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మెయిన్ లీడ్ లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. తమన్ సంగీతం సమకూర్చాడు. నిత్యామీనన్ మరియు సంయుక్తా మీనన్ హీరోయిన్ లుగా నటించారు.
ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం ఫిబ్రవరి21న యూసఫ్ గూడలో జరగనుంది. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. మంత్రి కేటీఆర్ ని దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు నాగవంశీ, చినబాబు వెళ్లి కలిశారు.
పవన్, కేటీఆర్ మొదటి సారి సినిమా వేదికను పంచుకుంటూ ఉండడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. కాగా ప్రపంచవ్యాప్తంగా భీమ్లానాయక్ ఫిబ్రవరి 25 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్‌గా భీమ్లానాయక్ చిత్రం తెరకెక్కింది.
Team #BheemlaNayak thanks @KTRTRS for obliging their request to grace the Pre-Release event on 21st Feb#BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati pic.twitter.com/r5hf4f7spa
— Suresh Kondi (@SureshKondi_) February 19, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com