Kubera Censor : కుబేర సెన్సార్ పూర్తి రన్ టైమ్ ఎంతంటే

అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. ఈ శుక్రవారం విడుదల కాబోతోన్న ఈమూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గా విడుదలైన కుబేర ట్రాన్స్ కు అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అలాగే ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. పూర్తిగా శేఖర్ కమ్ముల మార్క్ సినిమాగా కుబేర రూపొందిందని.. ఆర్టిస్ట్ లందరూ చెప్పారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం మరో హైలెట్ గా నిలవబోతోందని ట్రాన్స్ తోనే తేలిపోయింది. పాటలు సైతం ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం భారీ సినిమాలేం లేకపోవడంతో కుబేరపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. వాటిని అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకంతో కనిపిస్తోంది టీమ్.
ఇక సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికెట్ వచ్చింది. రన్ టైమ్ అంతా ఊహించినట్టుగానే ఉంది కానీ.. కాస్త తేడా ఉంది. చాలామంది ఈ మూవీ రన్ టైమ్ 3 గంటల 15 నిమిషాల వరకూ ఉందని అంచనా వేశారు. బట్ సెన్సార్ తర్వాత రన్ టైమ్ 3 గంటలుగా ఫిక్స్ అయింది. ఖచ్చితంగా చెబితే 181 నిమిషాల సినిమా ఇది. అయితే సెన్సార్ నుంచి ఏకంగా 19 కట్స్ ఉండటం విశేషం. ఆయా సన్నివేశాలను డిలీట్ చేసిన తర్వాతే వీళ్లు సెన్సార్ పూర్తి చేసుకున్నారు. నిజానికి శేఖర్ కమ్ముల సినిమాల్లో ఇన్ని డిలీటెడ్ సీన్స్ ఉండటం కనిపించదు. అన్ని సీన్స్ అంటే చిన్న విషయం కాదు. ఆశ్చర్యం ఏంటంటే.. అవన్నీ వయొలెన్స్ కు సంబంధించిన సన్నివేశాలే. సో.. శేఖర్ కమ్ముల ఈ సారి మరీ అంత సెన్సిటివ్ గా ఏం రావడం లేదు అనేది అర్థం అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com