Shekhar Kammula : డైరెక్టర్ కి స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన కుబేర టీమ్

మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో టాలీవుడ్ నుంచి శేఖర్ కమ్ముల పేరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ అతను ఒక స్పాన్ దగ్గర ఆగిపోయాడేమో అని భావించే వారు చాలామందే ఉంటారు. అందుకు కారణం ముందు తనకు కంఫర్ట్ గా ఉండేలా చూసుకుంటాడు. అందుకే స్టార్స్ తో మూవీ అంటే ఇన్నాళ్లు కాస్త ఇబ్బంది పడ్డాడు. బట్ కొన్ని కథలు స్టార్స్ నే డిమాండ్ చేస్తాయి. అలాంటప్పుడు కంఫర్ట్ జోన్ దాటుకుని రావాల్సిందే ఎవరైనా. ఇప్పుడు శేఖర్ కమ్ముల చేసింది అదే. ఫస్ట్ టైమ్ టాప్ స్టార్స్ ను డైరెక్ట్ చేస్తూ కుబేర అనే మూవీతో వస్తున్నాడు.
ఇవాళ(మంగళవారం) శేఖర్ కమ్ముల బర్త్ డే. ఈ సందర్భంగా మూవీ టీమ్ దర్శకుడుగా ఆయన పని చేసే విధానం తెలిసేలా ఒక వీడియో కట్ చేసి విడుదల చేసి శేఖర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ వీడియో చూడగానే అందరికీ నచ్చేలా ఉండటం విశేషం. మామూలుగా శేఖర్ కమ్ముల ఎంత సింపుల్ గా ఉంటాడో అందరికీ తెలుసు. సెట్స్ లోనూ అదే కనిపిస్తోంది. పెద్ద సినిమా కాబట్టి కేవలం శేఖర్ పైనే షాట్స్ కట్ చేస్తారు అనుకున్నారు. బట్ నాగార్జున, రష్మిక మందన్నా, ధనుష్ కూడా ఫ్రేమ్స్ లో ఉన్నారు. నిజానికి ఇది చాలా బావుంది. ముఖ్యంగా చివర్లో శేఖర్ కమ్ముల.. కట్ కట్ కట్ కట్ అంటూ నాన్ స్టాప్ గా చెప్పే సీన్ నవ్వులు పూయిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com