Kubera Trailer : కుబేర ట్రైలర్ రావడం లేదు

ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా, జిమ్ శరభ్ ప్రధాన పాత్రల్లో నటించి సినిమా కుబేర. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫస్ట్ టైమ్ పెద్ద స్టార్స్ తో రూపొందించిన సినిమా ఇది. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఫైనల్ గా ఈ నెల 20న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ విషయంలో చాలా వెనకబడే ఉన్నా.. శేఖర్ కమ్ముల దర్శకుడు కావడం.. స్టార్ కాస్ట్ ఎసెన్స్ గా ఉండటం వల్ల ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను డబుల్ చేసేలా ఈ శనివారం ట్రైలర్ విడుదల చేస్తాం అన్నారు. బట్.. ఆ ట్రైలర్ రావడం లేదు ఇవాళ అని తాపీగా చెప్పారు.
కుబేర ట్రైలర్ కోసం మొత్తం టీమ్ ఎంతో కష్టపడి వర్క్ చేసిందట. అలాంటి కష్టాన్ని కేవలం డిజిటల్ ప్లాట్ ఫామ్ (యూ ట్యూబ్) లో మాత్రమే విడుదల చేస్తే అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు అని రేపు (ఆదివారం) జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాస్త పెద్ద తెరపై ఈ ట్రైలర్ ను లాంచ్ చేయాలని భావిస్తున్నాం అంటూ ఎక్స్ వేదికగా ఒక వార్తను పోస్ట్ చేశారు. సో.. ఆ తెరపై ఇంపాక్ట్ మాత్రమే కాదు.. ఎమోషన్ కూడా బాగా కనెక్ట్ అవుతుందని చెప్పారు. అయితే ఇవాళ కన్నప్ప ట్రైలర్ కూడా ఉంది. అందుకే క్లాష్ ఎందుకు అనుకున్నారేమో ఇలా కవర్ చేశారు అనే కమెంట్స్ కూడా లేకపోలేదు. ఏదైతేనేం ఒక్కరోజే కదా.. ఆగుతారు. చూస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com