Kushi : యూఏ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ బోర్డు

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు సిద్దమవుతోంది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ తరుణంలో ఇటీవలే హైదరాబాద్ లో మ్యూజికల్ కన్సర్ట్ ను ఘనంగా జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్స్ లో ‘ఖుషి’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, టీజర్, పాటలు, ట్రైలర్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్. లవ్, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించడంలో దర్శకుడు శివ నిర్వాణ హిట్ ట్రాక్. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ గ్రాండియర్..ఇవన్నీకలిపి ‘ఖుషి’ మీద భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొనేలా చేశాయి. ఇక రీసెంట్ గా సెన్సార్ నుంచి వచ్చిన హిట్ టాక్ తో థియేటర్స్ లో ప్రేక్షకులు ఈ సినిమాతో ‘ఖుషి’ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం సెన్సార్ బృందం 165 నిమిషాల నిడివితో గల ‘ఖుషి’ మూవీకి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పటిదాకా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా బ్లాక్ బస్టర్ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రికార్డ్ చూస్తే అవన్నీ రెగ్యులర్ మూవీస్ కు కనీసం 20 నిమిషాల లెంగ్త్ ఎక్కువ ఉన్నవే. కథలో ప్రేక్షకులు లీనమైతే కాస్త ఎక్కువ లెంగ్త్ సమస్య కాదని గతంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ప్రూవ్ చేశాయి. ‘ఖుషి’ ఔట్ పుట్ మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇటీవల మ్యూజిక్ కన్సర్ట్ సూపర్ హిట్టయ్యింది. ఆడియెన్స్ లో కావాల్సినంత బజ్ ఏర్పడింది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నది ‘ఖుషి’ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసమే. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1న ‘ఖుషి’ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.
Back to entertaining the Families ❤️#Kushi is ready for you all - U/A
— Vijay Deverakonda (@TheDeverakonda) August 23, 2023
We are Just 9 days away. pic.twitter.com/R6JEutsO5e
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com