Kushi fifth Song: ‘ఓసి పెళ్లామా’అంటూ ఖుషి అవుతోన్న రౌడీ హీరో

Kushi fifth Song: ‘ఓసి పెళ్లామా’అంటూ ఖుషి అవుతోన్న రౌడీ హీరో
'ఖుషి' నుంచి మరో అప్ డేట్.. ఐదో సాంగ్ రిలీజ్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించి ‘ఖుషి’ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మూవీపై మరింత క్రేజ్ ను, హైప్ ను తీసుకువచ్చే పనిలో పడింది చిత్ర బృందం. అందులో భాగంగా రీసెంట్ డేస్ లో మూవీలోని పలు పాటలను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను మరింత ఉత్సాహ పరుస్తున్నారు. తాజాగా ‘ఓసి పెళ్లామా’అనే సాంగ్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. అంతకుముందు ఈ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రివీల్ చేశారు.

హేషమ్ అబ్దుల్ వాహబ్ ఖుషి సినిమాకు సంగీతం అందిస్తుండగా.. పాటలతోనే మంచి హైప్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే వచ్చిన నాలుగు పాటలు మంచి పాపులర్ అయ్యాయి. ఈ తరుణంలో ఐదో పాటను చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది.‘ఓసి పెళ్లామా’ అంటూ ఖుషి సినిమాలోని ఈ ఐదో పాట ఇప్పుడు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజయ్ దేవరకొండ పబ్ లో పాడే ఈ పాట.. మ్యూజిక్ ప్రియులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

‘ఓసి పెళ్లామా’ పాటను మెలోడీలా కాకుండా కాస్త డిఫరెంట్‍గా స్వరపరిచాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, సాకేత్ పాడారు. తెలుగులో ఈ పాటకు రిలిక్స్ అందించారు దర్శకుడు శివ నిర్వాణ. ‘ఓసి పెళ్లామా’ ఫుల్ లిరికల్ సాంగ్ రేపు (ఆగస్టు 26) రిలీజ్ చేయనున్నట్టు ఖుషి సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.


Tags

Read MoreRead Less
Next Story