Kushi Kapoor: టాలీవుడ్ సినిమాలో ఖుషీ కపూర్..

Kushi Kapoor: అందాల తార శ్రీదేవి ఇద్దరు కూతుళ్లు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడాలనుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ అమ్మ పేరుని నిలబెట్టాలని చూస్తోంది,. వచ్చిన ఆఫర్లకి వంద శాతం న్యాయం చేయడానికి ప్రయత్నిస్తోంది.
నాన్న బోనీ కపూర్ ప్రొడ్యూసర్, బంధువు కరణ్ జోహార్ అండదండలతో సినిమాల్లో ఆఫర్లు కొట్టేస్తోంది. ఇక ఇప్పడు విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని వచ్చిన ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి రావాలనుకుంటోంది. అయితే తండ్రికి మాత్రం మొదట తన కూతురు ఖుషిని తెలుగు తెరకి పరిచయం చేయాలని ఉంది.
ఆ మేరకు తెలుగు దర్శక నిర్మాతలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారు. అయితే అక్క జాన్వీ కపూర్ రాఘవేంద్ర రావు సినిమా పెళ్లి సందడిలో సందడి చేస్తుందనుకున్నారు. కానీ మరి ఎందుకో ఆ ప్రాజెక్టులో పాల్గొనలేదు.
తాజాగా వినిపిస్తోన్న మరో టాక్ త్రివిక్రమ్ సినిమాతో జూనియర్ ఎంటీఆర్ పక్కన కనిపించబోతోందని.. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com