Chiranjeevi : 'నువ్వు నా నడుము చూసావ్'.. చిరు, శ్రీముఖి మధ్య ఖుషి సీన్...!

Chiranjeevi : పవన్ కళ్యాణ్, భూమిక హీరోహీరోయిన్లుగా వచ్చిన ఖుషి మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా అంటే అందరికి ముందుగా గుర్తుకువచ్చేది భూమిక-పవన్‌ల మధ్య నడుము సీనే.. ఈ సీన్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.ఈ సీన్‌ని ఆ తర్వాత చాలా మంది కాపీ కొట్టారు.. అదే వేరే విషయం అనుకోండి.
ఇదే సీన్‌ని పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కాపీ కొడితే ఎలా ఉంటుంది.. అవును భోళాశంకర్ సినిమాలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చిరు-శ్రీముఖిల మీద ఈ ఖుషి సీన్‌ని ప్లాన్ చేసినట్టుగా సమాచారం.. నువ్వు నా నడుము చూసావ్ అని శ్రీముఖి అంటే అసలు అక్కడ నడుము ఎక్కడుంది అన్నీ ముడతలేగా అని ఫన్నీగా మెగాస్టార్ మాట్లాడుకునే సీన్ ఒకటి ప్లాన్ చేసారట.
తాజాగా ఈ సీన్‌ని షూట్ చేశారని ఫిలింనగర్‌లో న్యూస్ చక్కర్లు కొడుతోంది. వేదాళం సినిమా రీమేక్‌గా తెరక్కుతున్న ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్‌పై అనిల్ సుంకర ఈ మూవీని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.మహానటి ఫేమ్కీర్తి సురేష్ కీ రోల్ ప్లే చేస్తోంది. తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com