Kushi Musical Concert: స్టేజిపై షర్ట్ విప్పేసి సామ్ తో రొమాంటిక్ డ్యాన్స్ చేసిన రౌడీ హీరో
సెన్సేషన్ హీరో, రౌడీ హీరో అని ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ, 'శాకుంతలం' సినిమాతో మళ్లీ సినిమాలతో బిజీ అయిన స్టార్ హీరోయిన్ సమంత 'ఖుషి' సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో ఇటీవల రిలీజైన ట్రైలరే చెప్పింది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఖుషి మ్యూజికల్ కన్సర్ట్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ కన్సర్ట్ ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రమోషన్స్ ను ఈ ఈవెంట్ లో ప్రారంభించారు.
'ఖుషి' ఆడియో లాంచ్ పేరుతో హైదరాబాద్ HICC కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ మ్యూజికల్ కాన్సర్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'ఖుషి' సినిమా సాంగ్స్ ని సింగర్స్ లైవ్ లో పర్ఫార్మ్ చేశారు. ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ లో మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహిబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరిచారం, చిన్మయి లైవ్ పర్ఫార్మెన్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.
స్టేజిపై విజయ్, సామ్ డ్యాన్స్
ఇక ఈ ఈవెంట్ లో విజయ్, సమంత.. ఫ్యాన్స్ కు ఓ పెద్ద సర్ఫ్రైజ్ ఇచ్చారు. వేదికపై తమ డ్యాన్స్ తో అందర్నీ అలరించారు. ఇక ఆసక్తికరమైన విషయమేమింటే విజయ్ తన షర్ట్ తీసేసి, సమంతను ఎత్తుకుని చుట్టూ తిప్పుతూ.. తన డ్యాన్స్ తో తెగ హడావిడి సృష్టించాడు. దీంతో ఈ వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నాయి. హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని, ఇది మ్యూజికల్ కాన్సర్టా లేక ప్రీ వెడ్డింగ్ షూటా అని, వాళ్ళ డ్రెస్సింగ్ పై కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే వీరిద్దరిపై మీమ్స్, ట్రోల్స్ కూడా ఆ రేంజ్ లోనే వస్తున్నాయి. ఇటీవలే విజయ్ దేవరకొండ మారిపోయాడు, గతంలా హడావిడి చెయ్యట్లేదు అని అంతా అనుకున్న సమయంలో.. ఖుషి ఆడియో లాంచ్ ద్వారా విజయ్ ఏమి మారలేదని నిరూపించాడు. కాకపోతే కాస్త గ్యాప్ ఇచ్చాడు అంతే అని అంతా అనుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com