Kushi OTT Release : ఓటీటీలోకి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్

Kushi OTT Release : ఓటీటీలోకి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
X
త్వరలో ఓటీటీలోకి సమంత, విజయ్ ల 'ఖుషి'

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన 'ఖుషి' ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. బ్యూటీఫుల్ లవ్ అండ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను రూ.70కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా డిజిటల్ స్క్రీనింగ్ అక్టోబర్ 6, 2023న జరగనున్నట్టు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

'ఖుషి' మూవీ సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుంది. మంచి అంచనాల నడుమ ఈ సినిమా .. పాజిటివ్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. పలు నివేదికల ప్రకారం, 'ఖుషి' చిత్రానికి సంబంధించిన OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. 'VD13' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా మృణాళ్‌ ఠాకూర్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం ఉంది. గతంలో విజయ్-పరుశురామ్ కాంబినేషన్ లో గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.


Tags

Next Story