KUSHI Trailer : ఆన్ స్క్రీన్ పై క్యూట్ కెమిస్ట్రీ, ఇంటెన్స్ రొమాన్స్ తో ఆకట్టుకుంటున్న లవ్ బర్డ్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తోన్న లవ్ స్టోర్ బేస్డ్ మూవీ 'ఖుషి' కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలోని సాంగ్స్, టీజర్... సినిమాపై ఉన్న హైప్ ను మరింతగా పెంచేశాయి. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ అందించిన అద్బుతమైన సంగీతం సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. తాజాగా మేకర్స్ ఖుషి ట్రైలర్‌ను రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశారు. ఈ సినిమా వచ్చే నెల ఒకటో తేదీని రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అందుకే ప్రమోషన్స్‌లో భాగంగా నేడు సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ నెల చివరి వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఈ మధ్యలోనే మళ్లీ స్పెషల్ ఈవెంట్‌ను కూడా ప్లాన్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఖుషి ట్రైలర్ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
On SEPT 1st
— Vijay Deverakonda (@TheDeverakonda) August 9, 2023
We bring to the world
Full #Kushi ❤️https://t.co/gTnd1GJFMj#KushiTrailer pic.twitter.com/k6AzAT3i8e
'ఖుషి' ట్రైలర్.. ఇద్దరు ప్రముఖ తారల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీకి సంబంధించిన సన్నవేశాలను మేకర్స్ ప్రేక్షకులకు చూపించారు. ఈ ట్రైలర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా క్యూట్ గా ఉంది. ఇందులో విజయ్ దేవరకొండ, సమంతల కెమిస్ట్రీ అస్సలు మిస్ కాలేదు. విజయ్ సమంతను వెంబడిస్తూ అందంగా కనిపించాడు. ముఖ్యంగా కాశ్మీర్‌లోని అందమైన దృశ్యాలు కట్టిపడేసేవిగా ఉన్నాయి. ఇది ప్రేక్షకులను ఆరాధ్య, విప్లవ్‌ల హృదయపూర్వక ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. వారి ప్రేమ ప్రయాణంలో మనల్ని కూడా తీసుకెళ్తారు. జీవితంలాగే, ప్రయాణంలో హెచ్చు తగ్గులు, పోరాటాలు అలాగే చేదు తీపి క్షణాలు ఉంటాయి. ఇక విజయ్, సమంతల అద్భుతమైన కెమిస్ట్రీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అది సినీ ప్రియుల్ని తక్షణమే ప్రేమలో పడేలా చేస్తుంది.
'ఖుషి' సినిమాలో విజయ్ దేవరకొండ, సమంతతో పాటు జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ పలువురు నటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. మైత్రీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది.
శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన రెండో చిత్రం ‘ఖుషి’. 2018లో వచ్చిన మహానటి చిత్రంలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. కశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఖుషీ చిత్రీకరణ జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని పర్వతాలకు చెందిన ఓ ఆర్మీ ఆఫీసర్, కాశ్మీరీ యువతి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com