Kushi : నాల్గో సింగిల్ 'ఎదకి ఒక గాయం' రిలీజ్ కు రెడీ అవుతోన్న 'ఖుషి'

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంతల పాన్ ఇండియన్ రొమాంటిక్ డ్రామా 'ఖుషి'కి సంబంధించి ఇటీవల నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. ఈ సమయంలో ఖుషిలోని నాల్గవ పాట 'ఎదకి ఒక గాయం'ను కన్సర్ట్ లో పాల్గొన్న ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ప్లే చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ లిరికల్ సాంగ్‌ని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ పాట ప్రేమలో నొప్పి అనే ఎమోషన్ ఎలా ఉంటుందో చాలా భావోద్వేగంగా చిత్రీకరించారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 1న 'ఖుషి'ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, శరణ్య పొన్ వన్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ లు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సామ్, విజయ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక 'ఖుషి' సినిమాలోని సాంగ్స్, మ్యూజిక్ విషయానికొస్తే ఇప్పటికే విడుదలైన ఈ మూవీ నుంచి వచ్చిన మూడు పాటలు ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా 'ఆరాధ్య', 'నా రోజా నువ్వే' పాటలకు ఏ రెంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో 'ఖుషీ' మూవీపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ మధ్యే 'ఖుషీ' మూవీ టైటిల్ సాంగ్ కూడా రిలీజైంది. 'హేషమ్ అబ్దుల్ వహాబ్' ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. అతని ప్రతి పాటా యువత మనసును తాకేలా ఉంటున్నాయి. ఈ 'ఖుషి' టైటిల్ సాంగ్ కు మ్యూజిక్ అందించడంతోపాటు పాట కూడా అతడే పాడటం విశేషం. ఇక ఈ సాంగ్ లిరిక్స్ ను డైరెక్టర్ అయిన శివ నిర్వాణానే అందించాడు.
A touching melody to heal the heart ❤️#Kushi Fourth Single #YedhakiOkaGaayam out today at 6.03 PM ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) August 17, 2023
In cinemas SEP 1st💥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @MythriOfficial @saregamasouth pic.twitter.com/FPvu6AHlWL
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com