ఈ నెల 23న `కుట్ర` రిలీజ్

సిరి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సిరిపురం రాజేష్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’. ప్రీతి, గీతిక రతన్, ప్రియ దేశ్‌పాల్ హీరోయిన్లు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ నెల 23న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్ లో ప్రీ-రిలీజ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ... ``సిరిపురం రాజేష్ అడ్వకేట్ గా, వ్యాపారవేత్తగా , జర్నలిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. నాకు మంచి మిత్రులు, ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడం గొప్ప విషయం. సినిమా చూశాము. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మాట్లాడుతూ.. `సిరిపురం రాజేష్ అడ్వకేట్ గా, వ్యాపారవేత్తగా , జర్నలిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. నాకు మంచి మిత్రులు, ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడం గొప్ప విషయం. సినిమా చూశాము. అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా`` అన్నారు.
నటుడు, నిర్మాత, దర్శకుడు మాట్లాడుతూ సిరిపురం రాజేష్ మాట్లాడుతూ...`` మంచిర్యాలలో 1985 నుండి నేను జర్నలిస్ట్ గా పనిచేశాను. `కుట్ర` నా తొలి సినిమా. ఇద్దరి మిత్రుల మధ్య నడిచే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ నెల 23న దాదాపు 100 థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. తెలంగాణా పర్యాటక శాఖ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస గుప్త ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com