K.Vishwanath : గుంటూరు నుంచి మొదలైన ప్రస్థానం

సినీ దర్శకులు, కళాతపస్వి కె విశ్వనాథ్ (93) తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా, రేపల్లె, పెద పులివర్రులో ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు విశ్వనాథ్. బీఎస్సీ వరకు గుంటూరులోనే చదువుకున్న ఆయన, సినిమాలపై ఉన్న ఇష్టంతో మద్రాసుకు చేరుకున్నారు. 1957లో వచ్చిన 'తోడికోడళ్లు' సినిమాకు సౌండ్ ఇంజనీర్ గా, సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మూగమనసులు, ఇద్దరుమిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు కో డైరెక్టర్గా పనిచేశారు. అక్కినేని నాగేశ్వర రావుతో పరిచయం ఏర్పడటంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. అక్కినేని హీరోగా, కాంచన హీరోయిన్ గా 1965లో ఆత్మగౌరవం సినామాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు విశ్వనాథ్. మొదటి సినిమాకు నంది అవార్డు దక్కడం ఆయన పనితనానికి నిదర్శనం.
1992లో విశ్వనాథ్ తీసిన శంకరాభరణం సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు, జాతీయ సమగ్రతా పురస్కారం దక్కింది. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ పాల్కే అవార్డులు ఆయనను వరించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com