K.Vishwanath : కళా తపస్వికి ప్రధాని మోదీ సంతాపం

K.Vishwanath : కళా తపస్వికి ప్రధాని మోదీ సంతాపం
X
సినీ ప్రపంచంలో విశ్వనాథ్ ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు


దిగ్గజ దర్శకులు, కళా తపస్వి కె. విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇందుకు గాను ఆయన ట్వీట్ చేశారు "శ్రీ కె. విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. సినీ ప్రపంచంలో విశ్వనాథ్ ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు" అని మోదీ ట్వీట్ చేశారు.

తెలుగు సినీ దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్ (93) అస్తమించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags

Next Story