L2 Empuraan Collections : ఎంపురాన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి

మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్ 2 : ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. కాకపోతే ఇతర భాషల్లో చాలా వరకూ డల్ గా ఉన్నా.. కేరళలో మాత్రం అదరగొడుతూనే ఉంది. మార్చి 27న విడుదలైన ఎంపురాన్ పై హిందూ సంఘాలు మండిపడ్డారు. సినిమాను రీ సెన్సార్ చేయించారు. ఇందులో భజరంగి పాత్ర తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ ధర్నాలు చేశారు. టివి డిబేట్స్ లో రచ్చ చేశారు. దీంతో చిత్ర నిర్మాత దిగి రాక తప్పలేదు. మరోసారి సెన్సార్ చేయించి 27కు పైగా కట్స్ చెబితే అవన్నీ చేశారు. అయినా మాలీవుడ్ లో మోహన్ లాల్ పై ఉన్న అభిమానంతో పాటు సినిమాలో నిజాలే చెప్పారు అనే నమ్మకంతో ఈ చిత్రాన్ని వెనకేసు వస్తున్నారు ఆడియన్స్. రైటర్ మురళి గోపి మాత్రం ఎవరికీ సారీ చెప్పేదే లేదు అన్నట్టుగా భీష్మించుకున్నాడని.. హిందూ సంఘాలు కోపంగా ఉన్నాయి.
ఇక ఇవన్నీ ఎలా ఉన్నా ఎంపురాన్ 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటుతోంది. గోద్రా అల్లర్ల నుంచి స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ స్థాయిలో పోటీ పడుతున్న రెండు పవర్ ఫుల్ ఏజెన్సీలు పని చేసే విధానాన్ని చూపుతూ.. కేరళలోకి బిజెపిని రానివ్వం అనేలా రూపొందించిన ఈ కథకు, కథనానికి ఆ పార్టీ నుంచి విమర్శలు, వ్యతిరేకత రావడం సహజం. అందువల్లే కలెక్షన్స్ కాస్త తగ్గాయి అనుకుంటున్నారు. మరోవైపు కథనం మరీ నీరసంగా ఉండటం ఈ చిత్రానికి ఇతర భాషల్లో మైనస్ అయింది. లూసీఫర్ తరహా స్క్రీన్ ప్లే తో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికే 300 కోట్ల మార్క్ ను దాటేదే అంటున్నారు విశ్లేషకులు. మొత్తంగా 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇంకా చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తోంటే.. అది కష్టమే అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com