L2E Empuraan : దిల్ రాజు చేతికి మోహన్ లాల్ మూవీ

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఎప్పుడో ప్యాన్ ఇండియా స్టార్ గా ఆకట్టుకున్నాడు. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్డమ్ ట్రెండ్ మళ్లీ పెరిగింది. ఈ క్రమంలో మాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీతో వస్తున్నాడు మోహన్ లాల్. కొన్నాళ్ల క్రితం మళయాల టాప్ స్టార్స్ లో ఒకడైన పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో రూపొందిన లూసీఫర్ కు సీక్వెల్ గా ఇప్పుడు ‘ఎల్ 2 : ఎంపూరన్’ అనే మూవీతో వస్తున్నారు. ఈ సారి కూడా పృథ్వీరాజే దర్శకుడు. టీజర్ తో పాటు ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ చూస్తే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చెబుతున్నారు చాలామంది. డైరెక్షన్ తో పాటు ఈ సారి కూడా తను ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు పృథ్వీరాజ్. టోవినో థామస్, మంజు వారియర్, సూరజ్ వెంజరమూడు, కిశోర్, సచిన్ ఖేడ్కర్ వంటి వారు ఇతర పాత్రల్లో నటించారు. ఇక ఈ నెల 27న విడుదల కాబోతోన్న ఈ మూవీ తెలుగు రిలీజ్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నాడు.
తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ దిల్ రాజు ‘ఎల్ 2 : ఎంపూరన్’ను విడుదల చేయబోతున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ తర్వాతి రోజు తెలుగు నుంచి రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ మూవీస్ ఉన్నాయి. అలాగే అదే రోజు విక్రమ్ నటించిన వీర ధీర శూరన్ ఉంది. అయినా మాగ్జిమం ఊపు ఎంపూరన్ కే కనిపిస్తోందనేది నిజం. ఇప్పటి వరకూ వచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ కు భిన్నంగా ఎంపూరన్ సంచలనాలు క్రియేట్ చేస్తుందనే అంచనాలున్నాయి. మరి ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను అన్ని భాషల్లో రీచ్ అయితే ఎంపూరన్ తో మాలీవుడ్ నుంచి ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి మోహన్ లాల్ ఎంటర్ అవుతాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com