La La Bheemla DJ Version: 'లాలా భీమ్లా' పాటకు డీజే వర్షన్.. ఒరిజినల్‌కు ధీటుగా..

La La Bheemla DJ Version: టాలీవుడ్‌లో చాలా హైప్‌తో వస్తున్న మల్టీ స్టారర్ 'భీమ్లా నాయక్'. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ను ఫాలో అవ్వకుండా భీమ్లా నాయక్ కేవలం తెలుగులో మాత్రమే విడుదల అవుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా.. చాలామంది ప్రేక్షకులకు దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా నుండి వచ్చే ప్రతీ అప్డేట్ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌ను నింపుతోంది.
అరుణ్ కౌండిన్య పాడిన లాలా భీమ్లా పాట ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ అందరికీ హై వోల్టేజ్ ఎనర్జీని ఇచ్చింది. ఈ పాట విడుదలయినప్పటి నుండి ట్రెండ్ అవుతూ.. చాలామంది ప్రేక్షకులతో స్టెప్పులేయిస్తోంది. లాలా భీమ్లా పాట అంతగా హిట్ అవ్వడంతో మూవీ టీమ్ ఈ పాటకు డీజే వర్షన్‌ను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకుంది. తాజాగా లాలా భీమ్లా డీజే వర్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డిసెంబర్ 31 అంటే చాలామంది పార్టీలతో, డీజే పాటలతో ఎంజాయ్ చేసే రోజు. అందుకే ఇదే రోజు.. లాలా భీమ్లా పాట డీజే వర్షన్ విడుదల చేయడానికి కరెక్ట్ టైమ్ అనుకున్న మూవీ టీమ్.. పాటను వారి ముందు పెట్టింది. ఒరిజినల్ వర్షన్‌ను ఆదరించినట్టుగానే ప్రేక్షకులు ఈ డీజే వర్షన్‌ను కూడా ఇష్టపడుతున్నారు. మొత్తానికి ఈ న్యూ ఇయర్‌కు లాలా భీమ్లా డీజే వర్షన్ ఓ మోత మోగించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com