Lady Comedian : తల్లి కాబోతున్న లేడీ కమెడియన్

Lady Comedian : తల్లి కాబోతున్న లేడీ కమెడియన్
X

కోలీవుడ్ లేడీ కమెడియన్ ఇంద్రజా శంకర్ తల్లి కాబోతున్నట్లు వెల్లడించారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని, అందరి ఆశీస్సులు కావాలని ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రముఖ నటుడు రోబో శంకర్ కూతురే ఇంద్రజ. విజయ్ హీరోగా వచ్చిన బిగిల్(తెలుగులో విజిల్)తో ఈమె నటిగా మారారు. తర్వాత విశ్వక్‌సేన్ ‘పాగల్’, కార్తీ ‘విరుమాన్’ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ కార్తీక్‌ను వివాహం చేసుకున్నారు.

తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ శంకర్. వెండితెరపై తనదైన కామెడీతో మెప్పించిన రోబో శంకర్ ఇప్పుడు బుల్లితెరపై అలరిస్తున్నాడు. అతడి కుమార్తె ఇంద్రజ శంకర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. విజయ్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వం వహించిన బిగిల్ చిత్రంలో ఆమె పాండియమ్మ పాత్రను పోషించింది. ఈ సినిమా తర్వాత అభిమానులంతా ఆమెను పాండియమ్మా అని పిలవడం ప్రారంభించారు. ఆ చిత్రం తర్వాత ముత్తయ్య దర్శకత్వంలో నటుడు కార్తీ, అదితి శంకర్‌ జంటగా నటించిన ‘కొంబన్‌’ చిత్రం విడుదల కాగా, శంకర్‌ స్నేహితురాలిగా అదితి నటించింది. దీంతో తమిళ అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Tags

Next Story